AP RAINS: బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణం శాఖ. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు విస్తాయని వాతావరణ శాఖ.
Heavy Rain: ఏపీకి 16, 17 తేదీలలో భారీ వర్షాలు
మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైస్సార్, అన్నమయ్య జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రేపటికి తీవ్ర తుఫానుగా మారి 17వ తేదీన చెన్నై సమీపన తీరం దాటుతుంది అధికారులు అంచనా వేస్తున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. భారీ వర్షాలతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేసింది. అన్ని శాఖల అధికారుల సెలవులను రద్దు చేసింది.
శ్రీ సత్య సాయి జిల్లాలో నేటి నుంచి 17 వరకు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించింది. చిత్తూరులో ఇవాళ, రేపు, అనంతపురంలో బుధ, గురువారాలు సెలవులను ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లా కలెక్టర్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లా కోస్తా తీర ప్రాంతాలలో ఉన్న విద్యా సంస్థలకు సెలవును ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం నెల్లూరు బాపట్ల జిల్లాలో ఇప్పటికే సెలవులను ప్రకటించారు.
One thought on “AP RAINS: ఏపీని వణికిస్తున్న వానలు… రెడ్ అలెర్ట్ జారీ”